ప్రకాశం: శుక్రవారం కంభం పట్టణంలో శ్రీ గాయత్రి ఫౌండేషన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌ను గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల ఆశోక్ రెడ్డి ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి, పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, యాజమాన్యం కొలగట్ల కాశీశ్వర రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.