RR: ఎల్బీనగర్ నియోజకవర్గం చింతలకుంట అండర్పాస్ వద్ద కొనసాగుతున్న మరమ్మతు పనులను ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి పరిశీలించారు. పనుల ఆలస్యంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో పాటు, ట్రాఫిక్ రద్దీ పెరుగుతోందని పేర్కొన్నారు. ప్రజల సౌకర్యార్థం యుద్ధ ప్రాతిపదికన పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.