ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి దర్శకుడు మణిరత్నంతో తన అనుబంధాన్ని పంచుకున్నాడు. గతంలో ‘దళపతి’ సినిమాలో రజనీకాంత్ పక్కన కీలక పాత్రకు వయసు సరిపోకపోవడం, మణిరత్నానికి కృత్రిమ మేకప్ నచ్చకపోవడంతో అవకాశం కోల్పోయానని చెప్పాడు. ఇటీవల వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రానికి తెలుగు డైలాగ్స్ రాసే అవకాశం దక్కడం ఎంతో సంతృప్తినిచ్చిందని, నెల రోజుల్లో దీనిని పూర్తి చేశానని భరణి తెలిపాడు.