NRML: కడెం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో ఇటీవల ఏర్పాటు చేసిన చలివేంద్రం కేవలం బోర్డుకే పరిమితమైంది. తహశీల్దార్ కార్యాలయాని వచ్చే ఆర్జీ దారుల కోసం ఏర్పాటుచేసిన చలివేంద్రం వద్ద ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. తహశీల్దార్ కార్యాలయం వద్ద త్రాగునీటి సౌకర్యం కల్పించకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.