KNR: కరీంనగర్ నగర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించినట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ వెల్లడించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రయత్నాలతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద రూ. 840 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. రోడ్లు, జంక్షన్లు, వరద కాలువలు, ఘన వ్యర్థాల నిర్వహణ పనులతో నగరాన్ని ఆధునికంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు.