E.G: స్పెషల్ గ్రేడ్ నిడదవోలు మున్సిపాలిటీ వార్డుల పునర్విభజనపై అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు వార్డు పెద్దలతో అఖిల పక్ష సమావేశం నిర్వహించి పారదర్శకంగా వార్డుల పునర్విభజన చేయాలని పట్టణ ప్రజలసంక్షేమ సంఘం అధ్యక్షుడు జువ్వల రాంబాబు కోరారు. శుక్రవారం నిడదవోలులో మంత్రి కందుల దుర్గేష్ కార్యాలయంలో అడిషనల్ పీఎస్ రమణకి వినతి పత్రాన్ని అందించారు.