NLG: అమృత్ 2.0 పథకంలో భాగంగా చిట్యాలలో రూ.12.50 కోట్ల వ్యయంతో చేపట్టిన నీటి సరఫరా అభివృద్ధి పనులు ప్రస్తుతం 40 శాతం పూర్తయ్యాయి. ఇందులో భాగంగా 1,400 కేఎల్ సామర్థ్యం గల మూడు సర్వీస్ రిజర్వాయర్ల నిర్మాణం, 18.92 కిలోమీటర్ల పైప్లైన్ నెట్వర్క్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే 11 కి.మీ హెచ్డీపీఈ, 1.5 కి.మీ డీఐ పైప్లైన్ పనులు పూర్తయ్యాయి.