GTతో జరిగిన మ్యాచ్లో ఓటమిపై CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు. ‘GT అద్భుత ప్రదర్శనతో మమ్మల్ని చిత్తు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్లో మా కంటే మెరుగైన ప్రదర్శన చేశారు. 230 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడం సులువు కాదు. వారి ఓపెనర్లను కట్టడి చేయలేకపోయాం. టోర్నీ ప్రారంభంలోనే వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోవడంతో ఈ సీజన్ మాకు చాలా కష్టంగా సాగింది’ అని అన్నాడు.