MDK: ధాన్యం కొనుగోలు ఆలస్యం వల్లే రైతు ఆత్మహత్య చేసుకున్నాడనే వార్తలు అవాస్తవమని కలెక్టర్ ప్రతిమా సింగ్ స్పష్టం చేశారు. కుటుంబ కలహాల వల్లే ఆత్మహత్య జరిగిందని నివేదికలు చెబుతున్నాయన్నారు. జిల్లాలో ఇప్పటివరకు రూ.311 కోట్ల విలువైన 2.11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రైతుల ఖాతాల్లో జమ చేశామని రైతులు అధైర్యపడకుండా యంత్రాంగానికి సహకరించాలని కోరారు.