CSKతో జరిగిన మ్యాచ్‌లో విజయం అనంతరం GT బౌలర్ సిరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ప్రాక్టీస్ సమయంలో.. నేను నా రిథమ్‌ను మెరుగుపరుచుకోవడానికి కొత్త బంతితో బౌలింగ్ చేస్తా. తర్వాత యార్కర్ల కోసం ప్రయత్నిస్తా. ఇది ఎర్రమట్టి పిచ్ కాబట్టి బ్యాటర్లు కవర్స్ దిశగా షాట్లు ఆడేలా బంతులు వేశా. సంజూ శాంసన్ వికెట్ విషయంలో నేను అనుకున్న ఈ ప్లాన్ వర్కవుట్ అయింది’ అని చెప్పుకొచ్చాడు.