‘పెద్ది’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రామ్‌చరణ్ రాజకీయాల్లోకి ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్తులో పాలిటిక్స్‌లోకి వెళ్లే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశాడు. రెండు పడవలపై ప్రయాణం చేయనని, వినోద రంగంలోనే నంబర్ 1గా ఉండాలనుకుంటున్నట్లు తెలిపాడు. ‘పెద్ది’ నిజాయితీ గల రూటెడ్ స్టోరీ అని, ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారని నమ్మకం వ్యక్తం చేశాడు.