ఒక ఇంటర్వ్యూలో రామ్‌చరణ్ ఆసక్తికరమైన ర్యాపిడ్ ఫైర్ సమాధానాలు ఇచ్చాడు. బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ మోస్ట్ హ్యాండ్సమ్, స్టైలిష్ పర్సన్ అని కొనియాడాడు. సౌత్‌లో అత్యంత క్రమశిక్షణ గల నటుడు తన తండ్రి చిరంజీవి మాత్రమేనని చెప్పాడు. ఒకవేళ విలన్‌గా నటించాల్సి వస్తే హీరోగా ఎవరుండాలని అడగ్గా.. తాను ఎప్పటికీ కేవలం హీరోగానే నటిస్తానని చరణ్ ఖరాకండిగా చెప్పాడు.