ATP: జిల్లా టీడీపీ సీనియర్ నాయకుడు, మాసినేని గ్రాండ్ హోటల్ యజమాని మాసినేని రామయ్య మృతి చెందారు. ఆయన మరణం పట్ల అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రగాఢ సంతాపం తెలిపారు. తెలుగుదేశం పార్టీని ఎంతో అభిమానించే రామయ్య పార్టీకి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థించారు.