RR: ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి జర్నలిస్టుల హౌజింగ్ పాలసీపై కీలక హామీ ఇచ్చారు. ఈ పాలసీ యూనివర్సల్‌గా అమలు చేస్తామని, సొసైటీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి జర్నలిస్టుకు వ్యక్తిగతంగా ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని సచివాలయంలో తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు.