TG: రాష్ట్రంలో ఘనంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి. కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దంపతులు పుణ్యస్నానాలు ఆచరించారు. పవిత్ర పుష్కర స్నానం అనంతరం వారు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి శేష వస్త్రాలు బహుకరించి, జ్ఞాపికను అందజేసి ఆశీర్వచనాలు అందించారు.