సత్యసాయి జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా స్టడీ సర్కిల్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉచిత పోటీ పరీక్షల శిక్షణ అందించనున్నారు. మొదటి విడతగా కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గ్రూప్స్, పోలీస్, బ్యాంకింగ్, డీఎస్సీ వంటి ఉద్యోగాలకు నిపుణులతో ఆఫ్లైన్, ఆన్లైన్ విధానంలో శిక్షణ ఇస్తారు.