NRPT: ఏదైనా సంఘటన జరిగిన సందర్భంలో ఘటనా స్థలంలోనే నేరుగా (FIR) నమోదు చేస్తూ ప్రజల వద్దకు సేవలను విస్తరిస్తున్నామని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. అత్యవసర సమయాల్లో పోలీసులు ప్రజలకు అండగా నిలుస్తున్నారని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాధితులకు నేరం జరిగిన ప్రదేశంలోనే కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీని అందిస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.