SRPT: చివ్వెంల మండల పరిధిలోని ఐలాపురం గ్రామ శివారులో వరి కొయ్యలకు పెట్టిన నిప్పు ఒక్కసారిగా వ్యాపించి మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఫైరింజన్‌తో ఘటనా స్థలానికి చేరుకున్నారు. శ్రమించి మంటలను పూర్తిగా అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో స్థానికులు, రైతులు ఊపిరి పీల్చుకున్నారు.