PLD: సత్తెనపల్లిలో రోడ్లను ఆక్రమించి తోపుడుబండ్లు పెట్టే వ్యాపారులపై కఠిన చర్యలు ఉంటాయని సీఐ నాగమల్లేశ్వరరావు హెచ్చరించారు. రహదారులపై సైడ్ మార్జిన్ దాటి బండ్లు నిలపడం, మైకులు పెట్టి పెద్ద శబ్దాలు చేయడం వల్ల తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. వ్యాపారులు బాధ్యతగా వ్యవహరించి పోలీసులకు సహకరించాలని కోరారు.