AP: గుంటూరు జిల్లా SKBM ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు పదో తరగతిలో రాణించారు. ఆ విద్యార్థులు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజ శ్రేయస్సు కోసం జ్ఞానం వాడాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థుల్లో 27 మంది బాలికలుండటం మహిళా శక్తికి నిదర్శనమని కొనియాడారు. విద్యార్థుల కలలు వికసిత్ భారత్ లక్ష్య సాధనలో కీలకం అని అభిప్రాయపడ్డారు.