ASF: వినియోగదారుల సౌకర్యార్థం TGNPDCL 28 ఫీచర్లతో నూతన మొబైల్ యాప్ రూపొందించినట్లు ఆసిఫాబాద్ SE ఉత్తమ్ జాడే గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ యాప్ ద్వారా కొత్త కనెక్షన్, బిల్ చెల్లింపులు, ఫిర్యాదుల నమోదు, బిల్ హిస్టరీ, మీటర్ సమాచారం, లోడ్ మార్పు, ఆధార్ లింక్, భద్రతా సూచనలు వంటి అనేక సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. డిజిటల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.