SDPT: హుస్నాబాద్‌లో వృద్ధురాలి బంగారు గొలుసు చోరీ కేసును పోలీసులు 90 నిమిషాల్లో ఛేదించారు. పెన్షన్ ఇప్పిస్తానని నమ్మించి అయిలేని లక్ష్మీ మెడలోని రెండున్నర తులాల బంగారు చైన్‌తో పరారైన అల్లెపు కృష్ణను సీసీటీవీ ఆధారంగా బస్టాండ్ వద్ద పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్, హుస్నాబాద్ పోలీసులను సీపీ రష్మీ పెరుమాళ్ అభినందించారు.
Tags :