KNR: మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల విద్యాలయాల పనితీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల ప్రిన్సిపాల్స్‌ను అభినందించారు. ఫలితాలు తక్కువగా వచ్చిన గురుకుల విద్యాసంస్థలు కారణాలు సమీక్షించుకోవాలని ఆయన సూచించారు.