MDCL: ఉప్పల్లో రేపు జరగనున్న RCB vs SRH మ్యాచ్కు సంబంధించిన 39 వేల టికెట్లు నిమిషాల్లోనే అమ్ముడయ్యాయి. ఈ నేపథ్యంలో బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్న వారిపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అక్రమంగా టికెట్లు అమ్మితే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.