PPM: కొమరాడ మండలం దంగభద్ర గ్రామ పరిధిలో ఉన్న గ్రానైట్ క్వారీని జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా క్వారీలో జరుగుతున్న తవ్వకాల విధానం, అనుమతుల ప్రకారం కార్యకలాపాల నిర్వహణ, భద్రతా ప్రమాణాలు, సంబంధిత రికార్డులు, పనుల పురోగతిని పరిశీలించారు. మైనింగ్ కార్యకలాపాలు నిబంధనల మేరకు జరుగుతున్నాయా లేదా అని వాకబు చేశారు.