ASR: డుంబ్రిగూడ మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం జరిగిన పెసా కమిటీ ఎన్నికల్లో అగతంబిడి గణపతి మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా చిన్నబాబు, కార్యదర్శిగా అప్పారావు, ప్రధాన కార్యదర్శిగా గణేష్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు గణపతి మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి పెసా కమిటీ కీలకంగా పనిచేస్తుందని తెలిపారు.