pattabi show his hand:వాచిన చేయిన చూపిన పట్టాభి.. 14 రోజుల రిమాండ్
pattabi show his hand:తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (pattabi)ని పోలీసులు గన్నవరం (Gannavaram) కోర్టుకు తీసుకువచ్చారు. కోర్టు వద్ద పట్టాభి (pattabi) తన వాచిన చేయిని మీడియాకు చూపించారు. చేతులు కమిలిపోయాయని చూపిస్తూ కోర్టు లోపలికి వెళ్లారు.
pattabi show his hand:తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (pattabi)ని పోలీసులు గన్నవరం (Gannavaram) కోర్టుకు తీసుకువచ్చారు. కోర్టు వద్ద పట్టాభి (pattabi) తన వాచిన చేయిని మీడియాకు చూపించారు. చేతులు కమిలిపోయాయని చూపిస్తూ కోర్టు లోపలికి వెళ్లారు. పట్టాభితోపాటు దొంతు చిన్నా, గురుమూర్తి సహా 11 మంది తెలుగుదేశం నేతలను స్థానిక అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. కృష్ణా జిల్లా గన్నవరంలో నిన్న టీడీపీ కార్యాలయం వద్ద బీభత్సం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పట్టాభితోపాటు టీడీపీ నేతలు అక్కడికి రాగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. గన్నవరం పీఎస్‌లో టీడీపీ నేతలకు వైద్యపరీక్షలు నిర్వహించి.. కోర్టులో హాజరుపర్చారు.
పోలీసులు హింసించారు
తన భర్త పట్టాభిరామ్‌ను (pattabi) పోలీసులు హింసించారని ఆయన భార్య చందన (chandana) ఆరోపించారు. ఉన్నతాధికారుల సహకారంతో ఇలా జరిగిందని విమర్శించారు. తోట్లవల్లూరు పీఎస్‌లో తన భర్తను ముసుగు ధరించిన ముగ్గురు కొట్టారని తెలిపారు. పట్టాభి (pattabi) ఇంత ఆందోళనగా ఎప్పుడూ కనిపించలేదని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నేతలను కోర్టుకు తరలించే క్రమంలో గన్నవరం పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ శ్రేణులు నిరసనకు దిగారు. పోలీసుల ఆంక్షలు ఛేదించుకుని కేశినేని చిన్ని, వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు పీఎస్‌కు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్రమ కేసులు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు కూడా గన్నవరం కోర్టు వద్దకు చేరుకున్నారు.
పట్టాభి ఎక్కడ
అంతకుముందు పట్టాభి (pattabi) కనిపించడం లేదని నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఏకంగా డీజీపీకి (dgp) లేఖ రాశారు. దీంతో పోలీసులు పట్టాభిని (pattabi) గన్నవరం పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకొచ్చారు. అందుకు సంబంధించి ఫోటోను మీడియాకు విడుదల చేశారు. అక్కడే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. నిన్న గన్నవరంలో జరిగిన ఉద్రిక్త పరిస్థితుల తర్వాత పోలీస్ స్టేషన్ వచ్చిన పట్టాభిని (pattabi) పోలీసులు అక్కడికక్కడే అరెస్ట్ చేశారు. గన్నవరంలో శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నారని పలు సెక్షన్లతో కేసు నమోదు చేశారు. పట్టాభిని (pattabi) అరెస్ట్ చేసి..వాహనంలో మరో ప్రాంతానికి తరలించారు. పట్టాభి ఫోన్ స్విచాఫ్ అని వస్తుండడంతో, ఆయనను ఎక్కడికి తరలించారనే విషయంపై స్పష్టత లేదు.
వాహనంలో తిప్పి
వీరవల్లికి తరలిస్తున్నారని తెలిసింది. తర్వాత హనుమాన్ జంక్షన్ కు తరలిస్తున్నారని ప్రచారం జరిగింది. తన భర్త ఆచూకీ తెలియడం లేదని పట్టాభి (pattabi) భార్య చందన (chandana) మీడియా ముందుకు వచ్చారు. ఆచూకీ తెలియజేయాలని కోరారు. దీంతో పట్టాభిని (pattabi) పీఎస్ వద్దకు తీసుకొచ్చారు. నిజానికి గన్నవరం టీడీపీ కార్యాలయం వద్ద బీభత్సం చేసింది వంశీ (vamsi) అనుచరులు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు వెళ్లిన పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్నటి నుంచి వాహనంలో తిప్పి.. ఈ రోజు మీడియాకు చూపించారు.
వంశీ అనుచరులే?
గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ (vamsi) అనుచరులు రెచ్చిపోయారు. టీడీపీ కార్యాలయంపై దాడికి తెగబడ్డారు. కార్యాలయ ఆవరణలో ఉన్న కారుకు నిప్పు అంటించారు. ఆఫీసులో సామాగ్రిని ధ్వంసం చేశారు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు (chandra babu), ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌పై (lokesh) వంశీ (vamsi) విమర్శించారు. దీనిపై టీడీపీ నేతలు కౌంటర్ అటాక్ చేశారు. తమ నేతను విమర్శిస్తారా? అంటూ వంశీ అనుచరులు రెచ్చిపోయారు. టీడీపీ కార్యాలయం వద్దకు వచ్చి దాడి చేశారు. నిన్న మధ్యాహ్నం సమయంలో టీడీపీ కార్యదర్శి దొంతు చిన్నా ఇంటిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వెనుదిరిగారు. సాయంత్రం పార్టీ కార్యాలయం లక్ష్యంగా దాడి చేశారు.