AP: లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాష్ విచారణ ముగిసింది. లిక్కర్ కేసులో A7గా ఉన్న అవినాష్‌ను సిట్ అధికారులు ACB కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన కోర్టు రేపటి వరకు రిమాండ్ విధించింది. అనంతరం అవినాష్‌ను గుంటూరు జిల్లా జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాలతో అవినాష్ ఇవాళ ఉదయం పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే.