AP: మాజీ సీఎం జగన్కు ప్రభుత్వ విప్ జీవీ ఆంజనేయులు బహిరంగ సవాల్ విసిరారు. సూపర్సిక్స్ అమలుపై ఏ గ్రామం వస్తారో చెబితే అక్కడే తేల్చుకుందామన్నారు. వినుకొండలో జగన్ కోరుకున్న ఊరిలోనే పథకాల లబ్ధి చూపిస్తానని అన్నారు. సూపర్ సిక్స్ పథకాలు అందట్లేదనడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మీకు లేదని మండిపడ్డారు.