SKLM: ఆమదాలవలసలోని బడ్జెట్ పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని అప్సా ప్రతినిధులు ఎమ్మెల్యే కూన రవికుమార్‌ను గురువారం కోరారు. ఎమ్మెల్యే రవికుమార్‌ను అప్సా ప్రతినిధులు ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు సమానంగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.