E.G: పెరిగిన ఎండల దృష్ట్యా దేవరపల్లి ఆర్టీసీ బస్టాండ్‌లో టీడీపీ నాయకులు గురువారం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు ఇక్కడ కూలింగ్ మినరల్ వాటర్‌ను అందుబాటులో ఉంచారు. బస్టాండ్‌కు వచ్చే ప్రయాణికులు ఈ సేవను వినియోగించుకుని నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.