SRD: పటాన్చెరు మండలంలోని ఇస్నాపూర్ X రోడ్డు వద్ద గురువారం ఉదయం (35-40 సం.ల) గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. నలుపు టీషర్ట్, బూడిద రంగు జీన్స్ ధరించిన ఈ వ్యక్తి సుమారు 5.2 అడుగుల ఎత్తు, చామనచాయ రంగు కలిగి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరిచారు. వివరాలు తెలిస్తే పోలీస్ స్టేషన్ తెలియజేయాలని అన్నారు.