NRPT: మరికల్ అభయాంజనేయ స్వామి ఆలయానికి అర్చకుడిని నియమించాలని కోరుతూ కమిటీ సభ్యులు గురువారం దేవాదాయ శాఖ అధికారికి వినతిపత్రం ఇచ్చారు. గత అర్చకుడు వేణుగోపాల్ మృతితో ధూపదీప నైవేద్య పథకం కింద నాగరాజు శర్మను నియమించాలని కోరారు. ఇందులో కృష్ణయ్య, పట్టణయ్య, లక్ష్మీకాంత్ పాల్గొన్నారు.