NGKL: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణపై శుక్రవారం నిర్వహించే జిల్లా స్థాయి సమావేశాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. గగ్గలపల్లి తేజ కన్వెన్షన్ హాల్లో జరిగే ఈ సమావేశానికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలన్నారు. నిర్దేశిత లక్ష్యాల సాధన, ప్రగతిపై ఈ సమావేశంలో సమీక్షించనున్నారు.