కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో గురువారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.1,28,244 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 135 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 9 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారన్నారు. అలాగే, 1305 మంది అన్న ప్రసాదం స్వీకరించారని వివరించారు.