NLR: ఆత్మకూరులో ‘ప్రతి మహిళకు రూ.1500’ ఇస్తామంటూ సైబర్ మోసాలు జరుగుతున్నాయి. తాము సచివాలయం నుంచి మాట్లాడుతున్నామని నమ్మిస్తూ, పథకానికి ఎంపికయ్యారనే వంకతో ఆన్లైన్ ప్రక్రియ కోసం ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపాలని కేటుగాళ్లు కోరుతున్నారు. మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ స్పందిస్తూ.. ప్రభుత్వం ఇలాంటి పథకం ఏదీ ప్రవేశపెట్టలేదని, నకిలీ ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.