NLG: కనగల్ మండలం ధర్వేశిపురం శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానం ఆలయ హుండీల లెక్కింపు గురువారం చేపట్టారు. 55 రోజులకు గాను రూ. 9.72,755 ఆదాయం రావడం జరిగింది. ఆలయ మాజీ ఛైర్మన్ వెంకటరెడ్డి, జిల్లా దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సుమతి, ఆలయ కార్యనిర్వణాధికారి నాగిరెడ్డి, గ్రామ సర్పంచ్, గ్రామ కార్యదర్శి భక్తుల సమక్షంలో ఆలయ హుండీల లెక్కింపు చేపట్టారు.