WGL: గొర్రెకుంట గ్రామ శివారులో గుడుంబా తయారీ జరుగుతోందన్న సమాచారం మేరకు గీసుకొండ సీఐ విష్వేశ్వర్ నేతృత్వంలో పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో సుమారు 200 లీటర్ల పానకం ధ్వంసం చేసి, 5 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నారు. జాన్పాకకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఈ తయారీలో పాల్గొన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.