ATP: పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం నగరంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో 4 చక్రాల వాహనాలకు తాళ్లను కట్టి లాగుతూ వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చిరంజీవి మాట్లాడుతూ.. ఇంధన ధరలు పెరగడంతో మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.