SRD: జిల్లా ప్రజల సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా వర్షంలోనూ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసుల రక్షణ కోసం జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రత్యేక కిట్లను అందజేశారు. ప్రతికూల వాతావరణంలోనూ ప్రజా రక్షణే ప్రథమ కర్తవ్యమని, ఈ కిట్లు సిబ్బంది సురక్షితంగా, సమర్థవంతంగా విధులను నిర్వహించడానికి దోహదపడతాయని ఎస్పీ పేర్కొన్నారు.