TG: RRR ఉత్తరభాగం పనులకు కేంద్రం తాజాగా టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. సంగారెడ్డి జిల్లాలోని గిర్మాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా తంగడ్ పల్లి వరకు మొత్తం 161.518 కిలోమీటర్ల మేర 6 వరుసల గ్రీన్ ఫీల్డ్ రీజినల్ ఎక్స్ ప్రెస్వేని రూ.9,362.4 కోట్లతో అభివృద్ధి చేయనుంది. ఎలాంటి అడ్డంకులు లేకపోతే 2029 నాటికి RRR ఉత్తరభాగం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.