NLG: నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఎన్సీసీ 31(టి) బెటాలియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘యువ ఆపద మిత్ర’ శిక్షణలో భాగంగా గురువారం పానగల్ ఉదయ సముద్రంలో నీట మునిగిన వారిని రక్షించే అంశంపై ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చారు. బోట్లు, లైఫ్ జాకెట్లు వినియోగంపై మాక్‌డ్రిల్ నిర్వహించి విద్యార్థుల్లో విపత్తు నిర్వహణపై అవగాహన కల్పించారు.