AKP: జనసేన బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పార్టీ కార్యకర్తలకు సూచించారు. గురువారం ఎలమంచిలి వాసవి కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అలాగే బీజేపీ, టీడీపీ పార్టీలతో కలిసి పని చేయాలన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు.