GNTR: గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రత్యేక చొరవతో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన గుంటూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అరుదైన అవకాశం దక్కింది. విద్యార్థులను విమానంలో ఢిల్లీ విజ్ఞాన విహారయాత్రకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో విద్యార్థులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.