AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ పెదబొడ్డేపల్లి చెరువు సమగ్ర అభివృద్ధి పనులను టీడీపీ పట్టణ అధ్యక్షుడు చింతకాయల రాజేశ్ గురువారం ప్రారంభించారు. రూ.6.5 లక్షల గ్రాంట్తో పంట కాలువ పూడికతీత, చెరువుగట్టుపై జంగిల్ క్లియరెన్స్, రెండు గేట్ల ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. రూ.1.40 కోట్లతో అధునాతన వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసామన్నారు.