KNR: రామడుగు మండలంలో గురువారం జరిగిన VNR క్రికెట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్లో మల్యాల మండలం ముత్యంపేట జట్టు ఘన విజయం సాధించింది. జట్టు కెప్టెన్ శేఖర్ మాట్లాడుతూ.. ఆటగాళ్లు సమష్టిగా రాణించి ట్రోఫీని కైవసం చేసుకున్నారని తెలిపారు. విజేత జట్టుకు కప్, రూ.50 వేల నగదు బహుమతిని నరేందర్ రెడ్డి అందజేసి అభినందించారు.