GDWL: కేటీదొడ్డి మండల రైతులకు పచ్చి రొట్ట ఎరువుగా ఉపయోగించే జీలుగ విత్తనాలు అగ్రోస్ రైతు సేవా కేంద్రంలో అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ శాఖ అధికారి రాజా వర్ధన్ రెడ్డి తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. 30 కిలోల బస్తా ధరను ప్రభుత్వం రూ.2,453గా నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.