ఏలూరు: ఆగిరిపల్లి శ్రీ శోభనాద్రి లక్ష్మీ నృసింహ స్వామి వేదశాస్త్ర పాఠశాల ఋగ్వేద విద్యార్థి ఆకొండి కార్తికేయ శర్మ అఖిల భారత వేద పరీక్షలో ప్రగతి సాధించినందుకు పాఠశాల సెక్రటరీ సూరి వెంకట సుబ్రహ్మణ్య లక్ష్మీనారాయణ శర్మ గురువారం అభినందించారు. మైసూర్ అవధూత దత్త పీఠం ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన అఖిల భారత వేద పరీక్షలో ద్వితీయ శ్రేణి సాధించినట్లు చెప్పారు.