AP: ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై దాడి జరిగిందని వచ్చిన ఆరోపణలపై మండలి ఛైర్మన్ మోషేన్ రాజు క్లారిటీ ఇచ్చారు. సోము వీర్రాజు మంత్రి కాదని, ఆయనకు సమాధానం చెప్పే అధికారం లేదని ఛైర్మన్ స్పష్టం చేశారు. వైసీపీ సభ్యలు వెల్లో ఉండగా.. సోము వీర్రాజు కూడా పోడియం దగ్గరకు వచ్చారని తెలిపారు. సోము వీర్రాజుపై వైసీపీ సభ్యులు దాడికి యత్నించలేదని వెల్లడించారు.