TG: రాష్ట్రంలో అగ్ని ప్రమాదాల నివారణకు ఫైర్ డిపార్ట్మెంట్ తగిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మున్సిపల్ శాఖ, హైడ్రా పరస్పరం సమన్వయం చేసుకుంటూ పనిచేయాలన్నారు. ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జూన్ 15 లోగా సమగ్ర నివేదికను అందజేయాలని అధికారులకు సీఎం డెడ్లైన్ విధించారు.